Tuesday, June 30, 2026
Homeసినిమా‘పాయిజన్’లో మ్యాడ్ సాంగ్ ను విడుదల చేసిన శ్రీకాంత్

‘పాయిజన్’లో మ్యాడ్ సాంగ్ ను విడుదల చేసిన శ్రీకాంత్

సిఎల్ఎన్ మీడియా నిర్మించిన ‘పాయిజన్’ మూవీలోని మ్యాడ్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ తదితర నగరాల్లోని వివిధ లోకేషన్స్ లో భారీగా చిత్రీకరించారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “పాయిజన్ మూవీలోని మ్యాడ్ సాంగ్ సూపర్ గా ఉంది. చాలా ట్రెండీగా యూత్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. తప్పకుండా ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. మ్యూజిక్ చాలా క్యాచీగా ఉంది. హీరో రమణ నాకు తమ్ముడు కన్నా ఎక్కువే. అతడికి ఈ మూవీ పెద్ద హిట్ ఇవ్వాలి ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీం” అన్నారు.

డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ “మా పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీకాంత్ గారికి మా ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుది అన్నారు.  హీరో రమణ మాట్లాడుతూ “మా అన్నయ్య శ్రీకాంత్ గారు నా పాయిజన్ మూవీలోని మ్యాడ్ సాంగ్ ను రిలీజ్ చేయడం నా అదృష్టం. చాలా చాలా థాంక్స్ టూ అన్నయ్య. మ్యూజిక్ డైరెక్టర్ నిహారి ఈ మ్యాడ్ సాంగ్ కోసం జర్మన్ నుంచి ఏబూల్టన్ మ్యూజిక్ ను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular