Monday, March 16, 2026
Homeసినిమా‘భోళా శంకర్’కి ముహుర్తం కుదిరింది

‘భోళా శంకర్’కి ముహుర్తం కుదిరింది

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల కాంబినేషన్లో రూపొందనున్న భారీ చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం చేయనున్నట్టుగా చిరంజీవి ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ముహర్తం ఫిక్స్ చేశారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను నవంబర్ 11వ తేదీ ఉదయం 7:45 గంటలకు ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి మొదలవుతుంది. అన్నాచెల్లెల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. చిరంజీవి సరసన నటించే కథానాయిక ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.

ఈ చిత్రానికి యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ పుట్టినరోజున ఆవిష్కరించిన భోళా శంకర్ టైటిల్ పోస్టర్‌కు, మోషన్ పోస్టర్ కు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2022లో థియేటర్లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular