Sunday, March 15, 2026
HomeTrending Newsబుగ్గనకు వాణిజ్య పన్నులు

బుగ్గనకు వాణిజ్య పన్నులు

రాష్ట్ర కేబినేట్  మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు విడుదల చేశారు.

ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు ఆర్ధిక, ప్రణాళిక,శాసన సభా వ్యవహారాల శాఖతో పాటు వాణిజ్య పన్నుల శాఖను కూడా అప్పగించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలు చూస్తున్న కె. నారాయణ స్వామి ఇకపై ఎక్సైజ్ శాఖ బాధ్యతలు మాత్రమే చూడనున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై విపక్షాలు పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరగడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular