Ysrcp Mps Met Honble President Ram Nath Kovind To Complaint On Tdp :
బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం 2024 ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి సంకేతమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బద్వేల్ లో పోటీచేసే ధైర్యం కూడా టీడీపీ చేయలేకపోయిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ అంతర్ధానం కాబోతుందని, దీన్ని తట్టుకోలేక, చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అసాంఘీక శక్తులుగా, టెర్రరిస్టు మనస్తత్వం ఉన్నవారిగా తయారై నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ విజయసాయి నేతృత్వంలో వైసీపీ ఎంపీల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. టిడిపి నేతలు రాష్ట్ర పరువు, ప్రతిష్టలను ఎలా మంటగలుపుతున్నాడో రాష్ట్రపతికి వివరించామని, సీఎం గారిని ఇంత దారుణంగా మాట్లాడారా అని రాష్ట్రపతి గారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని విజయసాయి అన్నారు. అతి త్వరలో టీడీపీ అంతర్థానం కాబోతుందని అందుకే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుకుందని ధ్వజమెత్తారు. టీడీపీది బూతుల కల్చర్.. అదొక తెలుగు బూతుల పార్టీగా మారిందని, పట్టాభి వాడిన ఆ పదాన్ని చంద్రబాబు రాష్ట్రపతికి ఎందుకు చెప్పలేకపోయారని విజయసాయి ప్రశ్నించారు.
న్యాయమూర్తులకు.. కంటెప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971 ఎలా ఉందో… అదే రీతిలో రాజ్యాంగ హోదాలో ఉన్నవారి పట్ల కూడా ఎవరైనా ఇటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే.. చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని రాష్ట్రపతి గారిని కోరామని వెల్లడించారు. గత ఏడాదిన్నరగా.. ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయిన చంద్రబాబు ఒక టెర్రరిస్ట్ గా, ఆయన నేతృత్వంలో నడుస్తున్న పార్టీ నేతల సమూహంతో మాట్లాడిస్తున్న అసభ్యకరమైన బూతు భాష ఏ విధంగా ఉందో రాష్ట్రపతికి వివరించి, ఆ పార్టీని రద్దు చేయాలని కోరామని వివరించారు.
Must Read :బద్వేల్ లో వైసీపీకి భారీ మెజార్టీ