Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. నిన్న టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా ‘ప్రభుత్వ ఉగ్రవాద’దీక్ష పేరుతో నిరసన తెలపనున్నారు. దాడిలో ధ్వంసమైన టిడిపి కార్యాలయ ఫర్నీచర్, కార్లు మధ్యనే అయన దీక్షకు దిగనున్నారు. ఎల్లుండి రాత్రి 8 గంటలకు ఈ దీక్ష ముగియనుంది.

మరోవైపు చంద్రబాబు శనివారం ఢిల్లీలో పర్యటించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులతో పాటు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com