Saturday, June 6, 2026
HomeTrending Newsమా వల్లే కెసిఆర్ ప్రజల్లోకి వచ్చాడు – షర్మిల

మా వల్లే కెసిఆర్ ప్రజల్లోకి వచ్చాడు – షర్మిల

ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ఆరోపించారు. సమస్యలు లేవు అని చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా.. ఇంటికి వెళ్లిపోతానన్నారు. సమస్యలు ఉన్నాయని నేను నిరూపిస్తే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. వై.ఎస్ షర్మిల ఈ రోజు వికారాబాద్ జిల్లా చేవెళ్ళ నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డిలా బ్లాక్ మెయిల్ చేయడం మాకు రాదని షర్మిల చెప్పారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం చేతకాదని, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తల కేసీఆర్ చేతిలో ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగకు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం పలకరించలేదు.. అతను రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా ఇస్తారట వైఎస్ షర్మిల విమర్శించారు.

కేసీఆర్ అవినీతి పై ఆధారాలు ఉంటే బీజేపీ ఎందుకు బయటపెట్టలేదన్న వైఎస్ షర్మిల కేసీఆర్ నాలుకకు నరం లేదని గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని నమ్మించగలరన్నారు. మా పార్టీ వై.ఎస్.ఆర్.టి.పి వచ్చే వరకు కూడా కేసీఆర్ ఫామ్ హౌజ్ దాటి రాలేదని, మేము ప్రజా సమస్యలపై పోరాటం చేయటంతో కేసీఆర్ ముఖారవిందాన్ని ప్రజలు చూడగలుగుతున్నారని షర్మిల అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular