Sunday, May 19, 2024
HomeTrending Newsహుజురాబాద్ లో అభివృద్ది కెసిఆర్ పుణ్యమే

హుజురాబాద్ లో అభివృద్ది కెసిఆర్ పుణ్యమే

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినవేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాను చేశానని ఈటెల రాజేందర్ చెప్పుకుంటున్నా.. ఆ పనులు అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రభుత్వ నిధులతో చేపట్టిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన గొల్ల, కురుమ ముఖ్య నేతలు, మత్స్యకారుల సమావేశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్, MLC ఎగ్గే మల్లేశం, MLA లు జైపాల్ యాదవ్, నోముల భగత్ లు పాల్గొన్నారు.

అనంతరం TRS కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పౌర సరఫరా ల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. Trs పార్టీ ఈటెల రాజేందర్ కు ఎంతో గౌరవం, గుర్తింపు ఇచ్చిందన్నారు. తన తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మీరేం చేస్తారో… చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు ఏం చేశారో, కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంకు ప్రజలు అండగా ఉన్నారని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. Trs గెలుపుతోనే హుజూరాబాద్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్