Sunday, June 7, 2026
Homeసినిమావిక్రమాదిత్య ఎవరో తెలుసా?

విక్రమాదిత్య ఎవరో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ భారీ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ భారీ పిరియాడిక్ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. రాధే శ్యామ్ టీమ్ సరికొత్త టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అక్టోబర్ 23 వ తేదీన ఉదయం 11:16 గంటలకు టీజర్ విడుదల చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఒక మిస్టీరియస్ ప్రశ్నగా విక్రమాదిత్య ఎవరో తెలుసా అంటూ రాధే శ్యామ్ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. విక్రమాదిత్య ఎవరో తెలుసుకోవాలంటే.. రాధే శ్యామ్ టీజర్ ను చూడండి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక టీజర్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఇవ్వనున్నట్లు కూడా తెలియచేసింది. ప్రభాస్ బర్త్ డేను గ్లోబల్ ప్రభాస్ డే అంటూ సరికొత్త హ్యష్‌ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular