Sunday, September 22, 2024
HomeTrending Newsసిద్ధిపేట కలెక్టర్ పై హైకోర్టు అసహనం

సిద్ధిపేట కలెక్టర్ పై హైకోర్టు అసహనం

High Court Impatient Over Siddipet Collectors Remarks :

యాసంగి వరి విత్తనాల అమ్మకాల పై సిద్దిపేట కలెక్టర్ చేసిన వాక్యాల పై హైకోర్టులో విచారణ. ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్న పిటీషనర్. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులు గా చేర్చిన పిటిషనర్.

వరి విత్తనాల అమ్మకాల ను ప్రొహిభీషన్ యాక్ట్ లో ఏమైనా చేర్చరా అని ప్రశ్నించిన హైకోర్టు. అలాంటిది ఏమి లేదని కోర్టుకు తెలిపిన ఏజి బీఎస్ ప్రసాద్. అలాంటి చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోలేదని ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చిన ఎజి బీఎస్ ప్రసాద్. రైతుల విషయంలో కలెక్టర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు. కలెక్టర్ తీరు పై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందన్న హైకోర్టు. ఈ పిటీషన్ ను
చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేయాలని రీజిస్టార్ కు అదేశం.

Must Read : ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్