రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేంద్రం రాసిన లేఖ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. కేంద్రం రాసిన లేఖను అయన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందనడానికి కేంద్రం రాసిన లేఖ నిదర్శనమని పయ్యావుల పేర్కొన్నారు. జూన్ 30న కేంద్రం ఈ లేఖ రాసింది. ఆంధ్ర ప్రదేశ్ తన పరిమితికి మించి 17,924.94 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని లేఖలో కేంద్రం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం చేసున్న రుణాలు, కేంద్ర ప్రభుత్వం వెలిబుచ్చిన అభ్యంతరాలపై వెంటనే వివరణ ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలుగా తమకు జవాబు చెప్పకపోయినా కేంద్రానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అయన గుర్తు చేశారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.