Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్సెమీస్ కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

సెమీస్ కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

ICC T20 Wc England Australia Entered Into Semi Finals :

ఐసిసి టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ 1 నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఈ రెండు జట్లుతో పాటు సౌతాఫ్రికా కూడా ఐదేసి మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో సమంగా నిలిచినా మెరుగైన రన్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ మొదటి స్థానంలోను, ఆస్ట్రేలియా రెండో స్థానంలోనూ నిలిచి సెమీస్ లో అడుగు పెట్టాయి.

గ్రూప్ 2 కు సంబంధించి సూపర్ 12 మ్యాచ్ లు నేటితో ముగిశాయి. అబుదాబీ లోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో, మరో 22 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  కెప్టెన్ పోలార్డ్ ఈ మ్యాచ్ లో రాణించి 44 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో ఎవిన్ లూయీస్-29;  హెట్ మెయిర్-27 పరుగులు చేశారు. విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది.  ఆస్ట్రేలియా బౌలర్లలో హజెల్ వుడ్ నాలుగు వికెట్లు సాధించాడు. స్టార్క్, కమ్మిన్స్, జంపా తలా ఒక వికెట్ పడగొట్టారు.

సెమీస్ కు చేరాలంటే మంచి రన్ రేట్ తో మ్యాచ్ ను గెలవాల్సిన తరుణంలో… ఆస్ట్రేలియా 33 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ పించ్ 9 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకూ తన సత్తా చాటని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అసలైన మ్యాచ్ లో రాణించాడు. మిచెల్ మార్ష్ తో కలిసి రెండో వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 157 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మార్ష్ కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లతో  53 పరుగులు చేశాడు,  డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి  అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక భూమిక పోషించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు.

షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.  15 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులే చేసిన హెండ్రిక్స్ మొయిన్ అలీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ డికాక్….వాన్ డేర్ డస్సెన్ తో కలిసి రెండో వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వాన్ డస్సెన్ 60 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లతో 94; ఐడెన్ మార్ క్రమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు,  4సిక్సర్లతో 52 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టపోయి 189 పరుగులు చేసింది.

లక్ష్య సాధనలో ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభించిన ఇంగ్లాండ్ 38 పరుగుల వద్ద జేసన్ రాయ్ (20) కాలి గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు, అతని స్థానంలో మొయిన్ అలీ క్రీజులోకి వచ్చాడు. 58 పరుగుల వద్ద బట్లర్ (26) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. వెంటనే బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. మొయిన్ అలీ-37; డేవిడ్ మలాన్-33;  లివింగ్ స్టోన్-28 పరుగులతో రాణించారు, దీనితో 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేయగలిగింది.

94 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాడు వాన్డేర్ డస్సెన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.


ఇవి కూడా చదవండి: 

బట్లర్ సెంచరీ: ఇంగ్లాండ్ దూకుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్