Saturday, November 23, 2024
HomeTrending Newsనోట్ల రద్దుతో ఏమి సాధించారు - ఖర్గే

నోట్ల రద్దుతో ఏమి సాధించారు – ఖర్గే

Mallikarjun Kharge Questioned What The Prime Minister Has Achieved With The Demonetisation :

2 జీ స్కామ్ పై తప్పడు ప్రచారం చేశారని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాందేవ్ బాబ వంటి వారు కూడా తప్పుడు ప్రచారానికి సహకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. సంజయ్ నిరుపమ్ మీద వినోద్ రాయ్ కోర్టు కు అఫిడవిట్ దాఖలు చేశారని, 2 జీ స్కామ్ పై కొందరు కావాలనే కుట్ర పూరితంగా విష ప్రచారం చేశారన్నారు. ప్రత్యేక న్యాయస్థానం కూడా 2 జీ స్కామ్ లో ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

పెద్ద నోట్ల రద్దు చేసి నేటికి 5 ఏళ్ళు అయ్యింది.  పెద్ద నోట్ల రద్దు చేసిన నాడు దేశానికి చీకటి రోజని, అనేక పరిశ్రమలు మూత పడి లక్షలాది ఉద్యోగాలు పోయాయని మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్ పైన 5 నుంచి పది రూపాయలు తగ్గించి ప్రయోజనం లేదన్నారు. మూడు నెలల్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన లక్షా 92 వేల కోట్ల రూపాయలు ఆదాయం పొందిందని, తగ్గించిన ధరల వల్ల 13 వేల కోట్ల రూపాయలు మాత్రమే తగ్గుతాయన్నారు.

చమురు ధరల తగ్గింపు చాలా ఆలస్యం అయ్యింది… సెస్ రద్దు కూడా తక్కువే చేశారన్న మల్లిఖార్జున ఖర్గే అన్నీ అబద్ధపు మాటలతో బీజేపీ కాలం వెల్లదీస్తోందని మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి: 

హెటిరోలో నోట్ల కట్టలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్