AP High Court Termed :
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. అమరావతి రైతుల పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు, రాజధాని కోసం 30 వేల మంది రైతులు భూములిచ్చారుని, వారు భూములిచ్చింది రాష్ట్ర రాజధాని కోసమని వ్యాఖ్యానించారు. రాజధాని కేవలం అమరావతి రైతుల కోసం మాత్రమే కాదని, ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు రాజధానిగా ఉంటుందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం నాటి సమరయోధులు చేసిన పోరాటం వారి వ్యక్తిగతం కాదని, యావత్ దేశం కోసమని గుర్తు పెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
రాజధానిపై దాఖలైన కేసులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్ విధానం (వీడియో కాన్ఫరెన్స్, భౌతిక పద్ధతి)లో రోజువారీ విచారణను నిన్నటి నుంచి ప్రారంభించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్‌దవే నిన్న ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదిస్తున్నారు. అమరావతి ‘మాస్టర్ ప్లాన్’ను మార్చడానికి వీల్లేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమరావతిని ఘోస్ట్ సిటీగా మార్చిందని వాదించారు.
Also Read : టిడిపి చేయిస్తున్న దగా యాత్ర : ధర్మాన