Tuesday, April 1, 2025
Homeసినిమాకైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

Kaikala in Critical Condition
ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ‌త కొన్ని రోజుల క్రితం కైకాల ఇంట్లో కాలు జారిప‌డిపోవ‌డంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్ లో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ అస్వ‌స్థ‌కు గురి కావ‌డంతో జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

1959లో ‘సిపాయి కూతురు’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా.. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు.  గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ ప్ర‌స్థానంలో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. ఈమ‌ధ్య కాలంలో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హేష్ ‘మ‌హ‌ర్షి’ చిత్రాల్లో న‌టించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్