Friday, March 20, 2026
Homeసినిమా చైతు బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

 చైతు బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Laal Singh coming in April:
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ‘లాల్ సింగ్ చ‌ద్దా’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో క‌లిసి ఈ సినిమాలో న‌టిస్తున్నారు. అమీర్ ఖాన్, నాగ‌చైత‌న్య‌లపై కీల‌క స‌న్నివేశాలు, అలాగే కాకినాడ‌లో మరికొన్ని కొంత భాగం షూటింగ్ కొన్ని చిత్రీకరించారు. ఈ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి చైతు అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు.

అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ వాయిదా ప‌డింది. త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ఫిక్స్ అయ్యారని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత మ‌రోసారి వాయిదా ప‌డుతున్న‌ట్టుగా టాక్ వ‌చ్చింది. ఇప్పుడు లాల్ సింగ్ చ‌ద్దా మూవీని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ఈరోజు అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. నాగ‌చైత‌న్య కూడా లాల్ సింగ్ చ‌ద్దా మూవీ ఏప్రిల్ 14న విడుద‌ల కానుంద‌ని తెలియ‌చేస్తూ మూవీ పోస్ట‌ర్ ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య ‘బంగార్రాజు’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular