Karthikeya Married His Girl Friend Lohitha
హీరో కార్తికేయ వివాహం అతని చిన్ననాటి స్నేహితురాలు లోహిత రెడ్డితో ఘనంగా జరిగింది. నేటి ఉదయం 9.47 నిమిషాలకు ధనుర్లగ్నం ముహూర్తంలో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, స్నేహితులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు
ఆర్ ఏక్స్ -100 సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇటీవలే కార్తికేయ హీరోగా నటించిన ‘రాజ విక్రమార్క’ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Also Read : హి ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ : తాన్యా రవిచంద్రన్