Friday, April 19, 2024
Homeసినిమాహి ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ : తాన్యా రవిచంద్రన్

హి ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ : తాన్యా రవిచంద్రన్

I Wish To Do Much More Important Roles In Telugu Tanya Ravichandran :

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతిభావంతులైన కొత్త కథానాయికలకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది.  ఓ మంచి  అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలుగు తెరకు పరిచయమవుతోన్న కథానాయిక తాన్యా రవిచంద్రన్.  కార్తికేయ హీరోగా రూపొందిన ‘రాజా విక్రమార్క’ లో ఆమె నటించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం చేస్తూ… శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకం పై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క‘. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఎన్.ఐ.ఏ ఏజెంట్ పాత్రలో కార్తికేయ నటించారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

“చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. ముందు పీజీ పూర్తి చెయ్. తర్వాత సినిమాలు చేయొచ్చు అని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. అయితే… వరుస అవకాశాలు రావడంతో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేశాను. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక… పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ – హెచ్ఆర్‌) కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమా విషయానికి వస్తే.. ఓ రోజు దర్శకుడు శ్రీ సరిపల్లి ముందు ఫోన్ చేశారు. తర్వాత చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఓకే చేశాను”

“నా పాత్ర పేరు కాంతి. ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంది. అలాగే, తను భరతనాట్యం డ్యాన్సర్. నేను గత పదిహేనేళ్లుగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ… కాంతి చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో లక్షణాలు నచ్చాయి. ఆల్రెడీ ట్రైలర్లు చూసి ఉంటారు కదా.. కార్తికేయ ఏజెంట్ రోల్ చేస్తున్నారు. అంతకు మించి చెప్పలేను. నవంబర్ 12న విడుదల అవుతుంది. థియేటర్లలో సినిమా చూడండి. చాలా బావుంటుంది. మా నిర్మాత ’88’ రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి.టి భారీ స్థాయిలో సినిమా తీశారు.”

“కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌ పీరియ‌న్స్ బావుంది, హీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. ఆయనతో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణి గార్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది కానీ.. నేను సినిమా అంతా ఉంటాను. నాది చాలా ప్రామినెంట్ రోల్. ఇందులో ప్రశాంత్ ఆర్. విహారి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆల్రెడీ తొలి సాంగ్ విని ఉంటారు కదా! నేపథ్య సంగీతం కూడా బాగా చేశారని విన్నాను”

“నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, షూటింగ్ చేశా కదా! నాకు దర్శకుడు శ్రీ ఏదైతే కథ, సన్నివేశాలు చెప్పాడో… అ తీశాడు. ఫిల్మ్ మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. చిన్నతనం నుంచి నాకు సినిమాలు అంటే ఆసక్తి. కానీ, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండటం తాతయ్యకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు తాతయ్య ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. అందరికీ నచ్చేలా మంచి పాత్రల్లో నటించాలి అనుకుంటున్నాను”  అంటూ పలు విశేషాలు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి: 

‘రాజా విక్రమార్క’ థీమ్ సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్