Dev Katta Released The Aevum Jagat Teaser :

కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏవమ్ జగత్’. దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నంనాయుడు ఎన్. రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని రాధాస్ లవ్ అనే సాంగ్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు దేవాకట్టా విడుదల చేశాడు.

దర్శకుడు టీజర్ తోనే ఏవమ్ జగత్ సినిమా పై క్యూరియాసిటీ పెంచాడు. డైలాగ్స్ తో ఒక్కసారిగా సినిమా రేంజ్ పెరిగిందని చెప్పాలి. టీజర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆలోచింపచేసేలా ఉంది. టీజర్ లోనే ఈ రేంజ్ లో ఉంటే సినిమాలోని ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటీనటులు కూడా ఎంతో ఇంటెన్స్ తో కూడిన నటనను కనపరిచినట్లు ఏవమ్ జగత్ టీజర్ ను బట్టి తెలుస్తుంది. ఛాయాగ్రహణం చాలా బ్యూటీ ఫుల్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ‘ఏవమ్ జగత్’ విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి: 

 

‘ఏవమ్ జగత్’ ఫస్ట్ లుక్ విడుదల

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *