AP Cabinet :
రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో అమరావతి రాజధాని, మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందుబాటులో ఉన్న మంత్రులు ప్రత్యక్షంగా క్యాబినెట్ భేటిలో పాల్గొనగా, సిఎం సూచనల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినేట్ భేటిలో పాల్గొన్నారు.
అంతకుముందు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం జగన్ సమీక్షించారు, ఈ సమీక్షకు హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, డిజాస్టర్ మేనేజిమెంట్ కమిషనర్ కె కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read :అక్కడే ఉండండి: సిఎం ఆదేశం