Sunday, November 24, 2024
HomeTrending Newsప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి

Indian Border Roads Organisation In Guinness World Records :

భారత సరిహద్దు రహదారుల సంస్థ (BRO) ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సాధించినది. ఈ మేరకు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ను అందుకున్నారు.
తూర్పు లడఖ్‌లోని ఉమ్మింగ్లా పాస్ వద్ద సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారిని గత ఆగస్టు నెలలో ప్రారంభించారు. మౌంట్ ఎవరెస్ట్ సౌత్ బేస్ క్యాంప్ 17,598 (నేపాల్‌లో) అడుగుల ఎత్తులో ఉండగా, నార్త్ బేస్ క్యాంప్ 16,900 (టిబెట్‌లో) అడుగుల ఎత్తులో ఉంది. ఇప్పుడు ఈ రెండు బెస్ క్యాంపుల కంటే ఎత్తులో మన వాళ్ళు ఈ రహదారిని నిర్మించారు.
ఇంతవరకు దక్షిణ అమెరికాలోని బొలీవియాలో 18,953 అడుగుల వద్ద ఎత్తైన రహదారిని నిర్మించగా ఇప్పుడా రికార్డును భారత్ చెరిపేసింది. బ్లాక్-టాప్‌తో 52 కి.మీ.ల పొడవుతో ఉన్న ఈ రహదారి తూర్పు లడఖ్‌ – చుమర్ సెక్టార్‌లోని ముఖ్యమైన పట్టణాలను కలుపుతుంది.
ఈ మార్గం అక్కడి ప్రజల సామాజిక – ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచటమే కాకుండా కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఆలాగే ఈ రహదారి వాస్తవ నియంత్రణ రేఖకు (LAC) దగ్గరగా ఉండటంతో భద్రత దళాలు, యుద్ధ సామగ్రిని వేగంగా తరలించడానికి వీలు కలుగుతుంది.
ఈ ప్రాంతంలో చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలకు పడిపోతుంది. ఆలాగే ఈ ఎత్తులో ప్రాణవాయువు సాధారణ ప్రదేశాల కంటే దాదాపు 50 శాతం తక్కువగా ఉంటుంది. ఇటువంటి కఠినమైన భూభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ఒక సవాలుగా ఉంటుంది. ఇంతటి ప్రమాదకరమైన భూభాగంలో ఈ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2017లో పచ్చజెండా ఊపింది.
నాలుగేళ్ల పాటు అనేక సవాళ్లు ఏదుర్కుంటు సరిహద్దు రహదారి సంస్థ(BRO) ఈ పనులను విజయవంతగా పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించినందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  లు అభినందనలు తెలిపారు.

Also Read :  పూర్వాంచల్ రహదారి జాతికి అంకితం

RELATED ARTICLES

Most Popular

న్యూస్