Sirivennela:
సుప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనారోగ్యంతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన్ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం కిమ్స్ లో చేర్పించారు.
అయితే సిరివెన్నెల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వచ్చిన వార్తలపై కుటుంబ సభ్యులు స్పందించారు. అయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. న్యుమోనియా తో బాధపడుతున్నారని అందుకే కిమ్స్ లో చేర్పించామని తెలిపారు.