Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్జూనియర్ హాకీ క్వార్టర్స్ కు ఇండియా

జూనియర్ హాకీ క్వార్టర్స్ కు ఇండియా

India into Quarters:
పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్ లో ఇండియా క్వార్టర్స్ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో పోలాండ్ పై 8-2 తేడాతో విజయం సాధింఛి తర్వాతి రౌండ్లోకి అడుగు పెట్టింది. ఇండియా తో పాటు పూల్ ‘బి’ నుంచి ఫ్రాన్స్ కూడా క్వార్టర్స్ కు చేరికుంది. నేడు జరిగిన మ్యాచ్ లో కెనడాపై ఫ్రాన్స్ 11-1 భారీ తేడాతో విజయం సాధించింది.

పూల్ ‘ఏ’ నుంచి బెల్జియం, మలేషియా జట్లు క్వార్టర్స్ కు చేరుకున్నాయి.  నేడు జరిగిన ఈ పూల్ మ్యాచ్ ల్లో సౌతాఫ్రికాపై మలేషియా 4-3 తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ లో బెల్జియం చిలీపై 3-0 గోల్స్ తేడాతో గెలిచింది.

పూల్ ‘సి’ నుంచి నెదర్ల్యాండ్స్… పూల్ ‘డి’ నుంచి జర్మనీ క్వార్టర్స్ కు చేరుకున్నాయి. పూల్ ‘డి’ మ్యాచ్ లో ఈజిప్ట్ పై పాకిస్తాన్ 3-1 తేడాతో విజయం సాధించింది.

రేపు మ్యాచ్ ల తరువాత పూల్ ‘సి’, ‘డి’ ల నుంచి క్వార్టర్స్ కు చేరబోయే మిగతా రెండు జట్లు ఖరారవుతాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్