Lets See The Rabi Crop When Kharif Purchases Are Complete Piyush Goyal :
వరి ధాన్యం కొనుగోళ్ళపై తెలంగాణ ప్రభుత్వం కావాలనే రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాటి నుంచి అన్ని వ్యవహారాల్లో తెలంగాణకు మద్దతుగా ఉన్నామని కేంద్రమంత్రి వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్న్నోత్తరాల సమయంలో తెరాస పక్ష నేత కే. కేశవరావు ధాన్యం కొనుగోళ్ళపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ముందు ఖరీఫ్ కొనుగోళ్ళు పూర్తి అయిన తర్వాత ఏసంగి పంట విషయం ఆలోచిద్దామని మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. ఎఫ్.సి.ఐ. ఇప్పటికే సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రతి ఏడాది వరి ధాన్యం కొనుగోళ్ళు తెలంగాణ నుంచి పెంచుతున్నామని వివరించారు. ధాన్యం సేకరణలో క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉన్నా, రైతుల ప్రయోజనాలు కాపాడటంలో రాజీపడబోమని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నారు.
అయితే కేంద్రమంత్రి సమాధానంపై తెరాస ఎంపిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రబీలో వచ్చే పారాబాయిల్ద్ రైస్ ఎంత కొంటారో చెప్పలేదని మండిపడ్డారు. నాలుగు రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేస్తూ అడుగుతున్నా కేంద్రం నుంచి స్పష్టమైన జవాబు రాలేదన్నారు. వరి రకాలతో సంబంధం లేకుండా ఏసంగి పంట తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : కాంగ్రెస్ లేకుండా బిజెపిని ఎదుర్కోవటం పగటి కలే