Family Counselling :
Q. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. అక్కచెల్లెళ్లలో నేనే చిన్నదాన్ని. నాన్నది టూరింగ్ ఉద్యోగం. మాది పల్లెటూరే అయినా డిగ్రీ అయ్యాక నాన్నగారితో సిటీ వచ్చేసాం. మా మామయ్య కొడుకుతో చనువు ఉండేది. అది ప్రేమ అని నేను అనుకున్నాను. ఉత్తరాలు కూడా రాసుకున్నాం. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆ ఉద్దేశం లేదన్నాడు. ఆ కోపంలో మరో చిన్న ఉద్యోగం చేసే అతనికి దగ్గరయ్యాను. ఇతను పెళ్ళికి సై అన్నాడు. వేరే మతం కావడంతో ఇంట్లో ఒప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకున్నా . తర్వాత తెలిసింది అతనికి అప్పటికే పెళ్లి అయి పిల్లలు ఉన్నారని. అప్పటినుంచి గొడవలే. ఈ మధ్యలో నాన్న పోయారు. అమ్మ వచ్చింది. కానీ నా భర్త నిత్యం నరకం చూపేవాడు. ఈ గొడవల్లోనే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను. వాళ్ళకోసమైనా సర్దుకుపోదాం అనుకున్నా , ఆ హింస భరించలేక విడిపోయా. అమ్మ, నేను ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి చక్కటి స్థాయికి తీసుకువచ్చాం. వాళ్ళ తండ్రి ఏ రకంగానూ ఆదుకోలేదు. ఇప్పుడు పిల్లలను దగ్గరకి తీయాలని ప్రయత్నిస్తున్నాడు. ఎలా పిల్లలకి వివరించాలి ? నా కెదురైన అనుభవాలు వారికి కాకుండా ఏం చేయాలి?
-శిల్ప
A. అనుభవాలే పాఠాలు అనేది మీ పిల్లలకు ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. అమ్మ , అమ్మమ్మ కష్టాలు చూస్తూ పెరిగిన పిల్లలు అదంతా మరచిపోయి తండ్రికి దగ్గరవడం సులభం కాదు. అలాగని మీరు అదేపనిగా తండ్రి గుణగణాలు చర్చించకండి. చిన్నవయసులోనే సమస్యలు ఎదురైనా బెదిరిపోకుండా పిల్లల్ని ప్రయోజకుల్ని చేసారు. మీ కష్టం తెలియడానికి తండ్రి చెడ్డవాడని చెప్పక్కర్లేదుగా! అయినా వారికి తెలియని విషయలేమున్నాయని? చేయాలిసిందల్లా వారి భవిష్యత్తుకి బాటలు వేయడమే. అమ్మ కష్టాలు, కన్నీళ్లు మీ పిల్లలు కొనసాగించరు. నిశ్చింతగా ఉండండి. పిల్లలపై ఆధారపడకుండా, ఉద్యోగం చేసుకుంటూ
మీ ఆనందానికీ దారులు వేసుకోండి.
Family Counselling:
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]
Also Read:
Also Read:
https://idhatri.com/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b2%e0%b1%8b%e0%b0%9a%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81/