Monday, June 15, 2026
HomeTrending Newsపార్లమెంటు నుంచి తెరాస ఎంపిల వాకౌట్

పార్లమెంటు నుంచి తెరాస ఎంపిల వాకౌట్

Parliament : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, కేంద్రం వైఖరికి నిరసనగా రాజ్య సభ, లోక్ సభల నుండి నిరవధిక వాకౌట్ చేసిన TRS ఎంపీలు. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ లోక్ సభ నుండి వాకౌట్ చేస్తూ TRS పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. వాకౌట్ చేసిన వారిలో లోక్ సభలో తెరాస నేత నామ నాగేశ్వర్ రావు, రాజ్యసభలో తెరాస పక్ష నేత కే కేశవ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేష్ నేత, సురేష్ రెడ్డి, బిబి పాటిల్, కవిత, రాములు తదితరులు ఉన్నారు.

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఫ్లకార్డుల ప్రదర్శనగా బయటకు వచ్చిన నేతలు కేంద్రం తీరును దుయ్యబట్టారు. దేశ రైతాంగం కోసం గత వారం రోజులుగా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేస్తూ… నిరసన తెలిపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు TRS పార్టీ ఎంపీలు ప్రకటించారు.

Also Read :లోక్ సభలో TRS ఎంపీల నిరసన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular