Saturday, March 14, 2026
Homeసినిమాసోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ ట్రైలర్‌ విడుదల

సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ ట్రైలర్‌ విడుదల

Sony Agarwal as Detective:
‘7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సోనీ అగర్వాల్‌ ఇప్పటికీ ప్రేక్షకులకు హాట్‌ ఫేవరెట్‌గానే ఉంది. తాజాగా ఆమె  నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. సిన్మా ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్ పై నవనీత్‌ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌, పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ లాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలించాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ హాజరయ్యారు.

“ట్రైలర్‌ చూస్తుంటే ఆడవారి పై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్లు ఉంది. వాస్తవాలతో కూడిన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సోనీ అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరోయిన్‌ని ప్రధాన పాత్రకు ఎంచుకోవటంలోనే సగం సక్సెస్‌ సాధించారు. సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం. ఎంత కొత్త టాలెంట్‌ వచ్చినా తనలో కలుపుకుంటుంది. నిర్మాత శ్రీశైలం గారు మా టీఎఫ్‌సీసీ మెంబర్‌. దర్శకుడు నవనీత్‌ చారి కూడా మల్టీటాలెంటెడ్‌. సిరాజ్‌ గారి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుండటం నిర్మాతకు బాగా హెల్ప్‌ అవుతుంది” అని రామకృష్ణ గౌడ్ అన్నారు.

టీఎఫ్‌సీసీ డైరెక్టర్స్‌ వింగ్‌ జాయింట్‌ సెక్రటరీ సిరాజ్‌ మాట్లాడుతూ “సంగీత దర్శకుడే దర్శకుడు అయితే.. సినిమా ఏ లెవల్‌లో ఉంటుందో నవనీత్‌ చారి గారు నిరూపించారు. డిటెక్టివ్‌ సబ్జెక్ట్‌లకు మినిమమ్‌ గ్యారెంటీ ఉంటుంది. నా శక్తి మేరకు థియేటర్స్‌ ఇప్పించే ఏర్పాటు చేస్తాను. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఆర్టిస్ట్‌ లు, టెక్నీషియన్స్‌ అన్న బేధం లేకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్‌ లాగా కలిసి పోయాం. ఒక ఇంట్లో శుభకార్యాన్ని అందరూ కలిసి ఎలా విజయవంతం చేస్తారో.. మేమందరం అలాగే ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో మా కెమెరామెన్‌ లక్కీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దర్శకుడు నవనీత్‌ చారి గారు తక్కువ టైంలో అనుకున్న బడ్జెట్‌లో క్వాలిటీ సినిమా చేశారు. ఆయన వందల సినిమాలకు అనేక రంగాల్లో పనిచేయడం వల్లనే ఇది సాధ్యం అయింది. మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం” అన్నారు.

దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ “మంచి టెక్నీషియన్స్‌ టీంతో పని చేశాం. సోనియా అగర్వాల్‌ మా స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. ఒక స్టార్‌ హీరోయిన్‌ ఈ కథను సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేయటాన్ని బట్టి ఈ కథలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చు. నిర్మాత ఎప్పుడూ టెన్షన్‌ పడలేదు. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్‌ చేసి షూటింగ్‌ సమయానికి అన్నీ అరేంజ్‌ చేశారు. ఇలాంటి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం.  సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

Also Read : ‘ఆర్ఆర్ఆర్’ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular