Saturday, November 23, 2024
Homeసినిమాసినిమా గెల‌వాలి, అన్ని చిత్రాల‌కి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కాలి : అల్లు అర్జున్

సినిమా గెల‌వాలి, అన్ని చిత్రాల‌కి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కాలి : అల్లు అర్జున్

Pushpa :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీసు గ్రౌండ్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది అతిరధ మహారథులు హాజరయ్యారు.

పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “అందరికి ఫ్యాన్స్ ఉంటారు.. కానీ నేను గర్వంగా చెప్తున్నాను నాకు ఆర్మీ ఉన్నారు. మీరే నాకు అన్నీ. మీ తర్వాతే నాకు ఎవరైనా. ఈ రోజు చాలా మాట్లాడతాను.. ఎందుకంటే రెండేళ్ళ కష్టం చెప్పుకోవాలి. సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేవి శ్రీ ప్రసాద్, నేను, సుకుమార్ ఒకేసారి జర్నీ మొదలుపెట్టాం. ఇప్పుడు మూడో దశాబ్ధంలోకి వస్తున్నాం. అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు దేవి. ప్రతీ పాట సూపర్‌గా ఉంది. ఈ రోజు నేను దేవి, సుకుమార్ గారిని మిస్ అవుతున్నాను.

వాళ్లు సినిమా కోసం కష్టపడుతున్నారని తెలుసు. ‘పుష్ప’ కోసం పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. ప్రత్యేకంగా సినిమాటోగ్రఫర్ క్యూబా గారికి స్పెషల్ థ్యాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రష్మిక మందన్నను నేను ముద్దుగా కస్మిక అని పిలుస్తుంటాను. చాలా టాలెంట్ ఉంది ఈ అమ్మాయికి. సరైన కథలు, డైరెక్టర్స్ పడితే ఇంకా ఎత్తుకు ఎదుగుతుంది. సమంత గారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమాలో నటించిన ప్రతీ ఒక్క యాక్టర్‌కు థ్యాంక్స్. వాళ్లు అంతా అద్భుతంగా నటించారు. సుకుమార్ గారి గురించి ఏం చెప్పనక్కర్లేదు. సినిమా మాట్లాడుతుంది.

ఆయన విజన్ అద్భుతం. చంద్రబోస్ గారు అద్భుతమైన పాటలు రాసారు. వేటికవే భిన్నమైన పాటలు రాశారు. మొన్న విడుదలై అద్భుతమైన విజయం సాధించిన ‘అఖండ’ టీమ్ అందరికీ కంగ్రాట్స్. ‘పుష్ప’తో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్యతో పాటు మధ్యలో వచ్చే సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

Also read : ‘పుష్ప’లో సమంత పాట‌కు విశేష స్పందన

RELATED ARTICLES

Most Popular

న్యూస్