Tuesday, June 9, 2026
Homeసినిమా‘పుష్ప’లో సమంత పాట‌కు విశేష స్పందన

‘పుష్ప’లో సమంత పాట‌కు విశేష స్పందన

#ooAntavaooooAntava
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ పుష్ప సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె పాట విడుదలైంది. 2021లోనే అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్. ఈ ఏడాది టాప్ సాంగ్ ఇదే అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు పుష్ప యూనిట్. పక్కా మాస్ లిరిక్స్ తో ఈ పాట హుషారుగా సాగిపోయింది. ఈ సాంగ్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. వింటేనే అదరగోడుతున్న ఈ పాత తెర పై చూస్తే.. ఎలా ఉంటుందో అనే ఆస‌క్తిని క‌లిగించింది. మ‌రి.. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular