All are rumors:
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని టెస్ట్ జట్టు విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా ఇదే విషయాన్ని పదే పదే చెబుతూనే ఉన్నానని, ఒక రకంగా ఈ విషయంలో సమాధానం చెప్పి చెప్పి అలసిపోయానని వ్యాఖ్యానించాడు. సహచరులతో తన సంబంధాల మూలంగా జట్టు తలవంచుకునే పరిస్థితి ఎప్పటికీ రాబోదని, భారత క్రికెట్ పట్ల తనకుండే చిత్తశుద్ధి ఇది అంటూ తేల్చిచెప్పాడు. జట్టును సరైన దశలో ముందుకు నడిపించేందుకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ లకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చాడు.
అందుబాటులో ఉంటా:
సౌతాఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉంటానని విరాట్ వెల్లడించాడు. ఈ విషయమై వస్తున్న వార్తలను అయన కొట్టిపారేశాడు, ఈ విషయమై అడగాల్సింది నన్ను కాదు, ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి వార్తలు రాస్తున్న వారిని అడగండి’ అంటూ విలేకరులకు సూచించాడు. సెలవు కావాలంటూ బిసిసిఐకు తాను ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలియజేశాడు.
ముందస్తు సమాచారం లేదు:
వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించే విషయమై తనకు సెలెక్టర్లు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వార్త బైటికి రావడానికి గంటన్నర ముందుగానే టెస్ట్ జట్టు ఎంపిక విషయమై తాము చర్చించుకున్నామని, చివర్లో వన్డే కెప్టెన్సీ విషయమై తనకు తెలియజేశారని కోహ్లీ వివరించాడు. టి 20 కెప్టెన్ గా తప్పుకుంటానని చెప్పిన తర్వాత నుంచి బిసిసిసి నుంచి ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నాడు.
Also Read : కోహ్లీకి మంచిదే: బ్రాడ్ హాగ్