Friday, September 20, 2024
HomeTrending Newsచైనాకు బాసటగా రష్యా

చైనాకు బాసటగా రష్యా

బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ ను వివిధ దేశాలు వ్యతిరేకిస్తుంటే రష్యా చైనాకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరవుతానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా వెల్లడించారు. బుధవారం చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ తో జరిగిన వర్చువల్ సమావేశంలో పుతిన్ వింటర్ ఒలంపిక్స్ పై చర్చించారు.  చైనాతో సమస్యలు ఉంటె పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని పరోక్షంగా అమెరికాకు సూచించారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే వింటర్ ఒలంపిక్స్ 2022 వర్తమాన కాలంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయని పుతిన్ అన్నారు.

జింజియాంగ్ ప్రావిన్సులో వుయ్ఘుర్ ముస్లీంలపై చైనా దాష్టికాలను ప్రపంచదేశాలు నిరసిస్తున్నా కమ్యునిస్టు పాలకులకు ఎక్కడం లేదు. వుయ్ఘుర్ జనాభా నియంత్రణకు కుట్రపూరిత పద్దతులు, బానిసలుగా గనుల్లో పని చేయించటం, చైనా అక్రమాల్ని ప్రశ్నించిన వారిని హతమార్చటం జరుగుతోంది. టిబెట్ లో భౌద్దుల ఆరామాలను కూల్చి పర్యాటక స్థలాలుగా మార్చటం, టిబెటన్ల సంస్కృతిని దెబ్బతీసే చర్యలు, టిబెట్ లో చైనా ప్రజలు శాశ్వత నివాసాలు ఏర్పరుచుకునేందుకు ప్రోత్సహించటం వివాదాస్పదం అయింది. టిబెటన్ల సంప్రదాయ పద్ధతులకు విరుద్దంగా చైనా పాలకులు విధానపరమైన నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. వీటికి తోడు హాంకాంగ్ లో ప్రజాస్వామ్యవాదులపై చైనా దారులు, హక్కుల కార్యకర్తలను హతమార్చటం, తైవాన్ తీరంలో చైనా యుద్ద సన్నద్దత, భారత్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు ప్రపంచ దేశాలను నివ్వెరపరిచాయి.

ఈ నేపథ్యంలో చైనా కట్టడికి ఇదే సరైన మార్గమని అమెరికా బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ ను బహిష్కరించింది. అమెరికాకు బాసటగా ఆస్ట్రేలియా, బ్రిటన్, లిత్వేనియా దేశాలు ప్రారంభ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దౌత్య పరంగా తమ ప్రతినిధులను పంపకుండా బహిష్కరిస్తున్నామని ఇప్పటికే ప్రకటించాయి. ఇదే కోవలో తాజాగా కెనడా కూడా చేరింది.

Also Read : వింటర్ ఒలంపిక్స్ కు దూరంగా ఆస్ట్రేలియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్