Monday, September 23, 2024
Homeసినిమా‘గీత’ ఘనవిజయం సాధించాలి : వి.వి.వినాయక్

‘గీత’ ఘనవిజయం సాధించాలి : వి.వి.వినాయక్

Geetha-Mute Witness:
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వను దర్శకుడిగా పరిచయం చేస్తూ… వి.వి.వినాయక్ ఆశీస్సులతో గ్రాండ్ మూవీస్ పతాకం పై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘గీత’.  ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉపశీర్షిక. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా… ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను వి.వి. వినాయక్ విడుదల చేశారు.

తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘గీత’ ఘనవిజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని వి.వి.వినాయక్ అభిలషించారు. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ ‘ఛత్రపతి’ పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ… తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ కు నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ, ఈ చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని  పేర్కొన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా… ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం.

Also Read : సమంత ‘యశోద’లో వరలక్ష్మీ శరత్ కుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్