Vizag – IT:
విశాఖపట్నం అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి సూచించారు. ‘దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలి’ అంటూ ట్విట్టర్ ద్వారా  సూచన చేశారు. విషయ పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని, 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్.ఎస్.బీ.సీ. మూతపడడం బాధాకరమని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బిసి కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనమని లోకేష్ విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు అంటూ హితవు పలికారు.

‘మరో రత్నం మాయం – హెచ్ఎస్బీసీ శాఖ మూత’ అంటూ ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చిన వార్త పేపర్ కటింగ్ ను జత చేస్తూ లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

Also Read : దారి మళ్లింపు రాజ్యంగ విరుద్ధం: లోకేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *