Tuesday, June 9, 2026
HomeTrending Newsవిశాఖలో పలు ప్రాజెక్టుల ప్రారంభం

విశాఖలో పలు ప్రాజెక్టుల ప్రారంభం

Vizag City- projects:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ నగరానికి మరింత శోభ చేకూరేలా మహా విశాఖ నగర పాలక సంస్ధ (జీవీఎంసీ), విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ లను సిఎం ప్రారంభించారు. తొలుత ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌ లను ప్రారంభించారు. అనంతరం ఉడా పార్క్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌

  1. దేశంలోనే తొలిసారిగా రూ. 150 కోట్లతో రోటరీ మోడల్‌లో నిర్మించిన వంతెన
  2. పిఠాపురం కాలనీలో రూ. 7.60 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయం ప్రారంభం
  3. రూ. 7.55 కోట్లతో ఆనందపురం జంక్షన్‌ నుంచి బొని గ్రామం వరకూ 9 కిమీ మేర నిర్మించిన రెండు వరసల రహదారి ప్రారంభం
  4. రూ. 7.50 కోట్లతో మధురవాడ లా కాలేజ్‌ నుంచి రుషికొండ బీచ్‌ వరకూ నిర్మించిన రెండు వరసల రహదారి ప్రారంభం
  5. రూ. 6.97 కోట్లతో ఎన్‌ హెచ్‌ 16 నుంచి విశాఖ వ్యాలీ స్కూల్‌ మీదుగా బీచ్‌ రోడ్‌ వరకూ నిర్మించిన రెండు వరసల రహదారి ప్రారంభం
  6. రూ. 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కళ్యాణమండపం ప్రారంభం
  7. రూ. 1.56 కోట్లతో తాటిచెట్లపాలెంలోని ధర్మానగర్‌లో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ ప్రారం

వుడా పార్క్‌ వద్ద జరిగిన ప్రారంభోత్సవాలు

  1. వుడా పార్క్‌ ఆధునీకరణ… రూ. 33.50 కోట్లతో వుడా పార్కును సమగ్ర అభివృద్ది చేసి స్మార్ట్‌ పార్క్‌ గా, అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తయిన ఆధునీకరణ పనులు
  2. జగదాంబ జంక్షన్‌లో రూ. 11.45 కోట్లతో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ ప్రారంభం. మెకనైజ్డ్‌ ఆటోమెటిక్‌ పార్కింగ్‌ సౌకర్యంతో నిర్మాణం
  3. రూ. 4.65 కోట్లతో దండుబజార్‌లో విభిన్నంగా, వినూత్నంగా తీర్చిదిద్దిన మహారాణి విద్యా దేవి హైస్కూల్‌
  4. రూ. 4.24 కోట్లతో శిధిలావస్ధలో ఉన్న టౌన్‌ హాల్‌ ఆధునీకరణ
  5. రూ. 7.16 కోట్లతో ఓల్డ్‌ మునిసిపల్‌ హాల్‌ ఆధునీకరణ

పనులను ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular