Thursday, March 28, 2024
Homeసినిమాఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ లాంఛ్

ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ లాంఛ్

Aadi as CSI:
చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ‘సి.ఎస్.ఐ. స‌నాత‌న్’ ని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేష‌న్ (సియ‌స్ఐ) ఆఫీస‌ర్ గా ఆది ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఒక భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27న ప్రారంభ‌మ‌వుతుంద‌ని చిత్ర నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ అన్నారు.

ఈ సినిమా కాన్సెప్ట్ ని అనిల్ రావిపూడి అభినందించారు. అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందించిన మోష‌న్ పోస్ట‌ర్ చాలా ఇప్రెసివ్ గా ఉంది. తార‌క్ పోన్న‌ప్ప‌, నందిని రాయ్, అలీ రాజా, వ‌సంతి , మ‌ధు సూద‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తు న్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో శివ‌శంక‌ర్ దేవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ “కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో ఆది చాలా ప్రెష్ గా అనిపించారు. క్రైమ్ థ్రిల‌ర్స్ ని గ్రిప్పింగ్ గా చెప్ప‌గ‌లిగితే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ద‌ర్శ‌కుడు శివ‌శంక‌ర్ దేవ్, నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ ల‌కు ఆల్ ద బెస్ట్” అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ “రెండ్రోజుల క్రిత‌మే ఒక లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసాం. మ‌రో షెడ్యూల్ ఈ నెల 27 న మొద‌ల‌వుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ చేస్తాం. ఆది సాయికుమార్ ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపిస్తారు. స‌నాత‌న్ గా ఆయ‌న న‌ట‌న చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్