Sunday, February 23, 2025
HomeTrending Newsపిల్లలను కనటమే ముస్లీంల పని..

పిల్లలను కనటమే ముస్లీంల పని..

The Goal Of Muslims Is To Increase Their Population :

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల రణరంగం మొదలైంది. రాజకీయ పార్టీల ప్రచారం, నేతల రెచ్చగొట్టే మాటలతో ఎన్నికల వేడి రాజుకుంది. మజ్లీస్ నేత వ్యాఖ్యలపై స్పందించిన  యుపి మంత్రి ఘాటుగా బదులిచ్చారు.  వీరి ఇద్దరి పోటాపోటీ వ్యాఖ్యలతో ప్రజలు అవాక్కవుతున్నారు.

ఆల్ ఇండియా మజ్లీస్ ఎ ఇత్తహదుల్ ముసల్మాన్ (AIMIM) పార్టీ నేత ఘుఫ్రాన్ నూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎం ఐ ఎం  అధినేత ప్రధానమంత్రి కావాలంటే ముస్లీంలు పెద్దసంఖ్యలో బిడ్డల్ని కనాలని, ముస్లీం జనాభా పెరిగితేనే అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి కాగాలుగుతారని ఘుఫ్రాన్ నూర్ చేసిన ప్రసంగం యుపిలో వైరల్ అయింది.

ఘుఫ్రాన్ నూర్ వ్యాఖ్యలకు యోగి ప్రభుత్వ మంత్రి ధీటుగా జవాబు ఇచ్చారు. ప్రస్తుతం ముస్లీంలు తమ జనాభా పెంచే పనిలోనే ఉన్నారని,  ముస్లీంలకు తినటం, బిడ్డలను కనటం తప్ప మరేమీ తెలియదని ఉత్తరప్రదేశ్ జల్ శక్తి మంత్రి బలదేవ్ సింగ్ ఓఖ్ల ఘాటుగా బదులిచ్చారు. పిల్లలకు విద్య, వైద్యం గురించి ఆలోచించని ముస్లీంలు జనాభా మాత్రం పెంచే పనిలో ఉన్నారని విమర్శించారు. ముస్లీంల జనాభా పెరుగుతుంటే ఎవరు పట్టించుకోవటం లేదని, రాబోయే రోజుల్లో ఇది సమస్యలకు దారితీస్తుందని మంత్రి బలదేవ్ సింగ్ ఓఖ్ల ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో పార్టీల వ్యూహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్