CJI to Native Place:
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంటక రమణ ఎల్లుండి, డిసెంబర్ 24న తన స్వగ్రామంలో పర్యటించనున్నారు. కృష్ణా జిలా నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలంలోని పొన్నవరం జస్టిస్ రమణ సొంత వూరు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో అయన మొదటిసారిగా తన స్వగ్రామానికి వస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు గ్రామస్తులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు జస్టిస్ రమణ పొన్నవరం చేరుకుంటారు, స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్థులతో కాసేపు ముచ్చటించే అవకాశముంది.
మాతృభూమి, మాతృ భాషపై ఎంతో మమకారం చూపే జస్టిస్ రమణ భారత సర్వోన్నత న్యాయస్థానం అధిపతిగా తన స్వగ్రామంలో పర్త్యటిస్తూ ఏ హోదాలో ఉన్నా తన మూలాలు మర్చిపోలేదని మరోసారి నిరూపించుకున్నారు.
Also Read : భారతంలోనూ మధ్యవర్తిత్వం: జస్టిస్ రమణ