Thursday, April 25, 2024
Homeసినిమాఈ క్రెడిట్ అంతా సుకుమార్ దే : అల్లు అర్జున్

ఈ క్రెడిట్ అంతా సుకుమార్ దే : అల్లు అర్జున్

Pushpa – Success Party:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని స‌క్సస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సంద‌ర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింది. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.

ఈ వేడుక‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ “రెండు సంవత్సరాలుగా చిత్తూరు గురించి బాగా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు.. వాళ్ళ భాష యాస ఎలా ఉంటుంది.. అనేది అన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ అయినా చిత్తూరులో పెట్టాలి అనుకున్నాము. అనుకున్నట్టుగానే మొదటి ఫంక్షన్ ఇక్కడ చేయడం ఆనందంగా ఉంది. సుకుమార్ అంటే సుకుమారంగా ఉంటారు అనుకుంటిరా ఫైర్.. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పుష్ప నుంచి నాకు పేరు వచ్చినా.. ఇంకేది వచ్చినా అంతా మా సుకుమార్ గారిదే. ఇంకా ఇంతకంటే సినిమా గురించి నేనేం చెప్పలేను.

మీ వెనకాల ఆ ఏడుకొండల స్వామి ఎలా ఉన్నాడో.. నా వెనకాల మా సుకుమార్ అలా ఉన్నాడు.. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి. మా శ్రీవల్లి కేవలం సినిమాలో మాత్రమే కాదు బయట కూడా చాలా నచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఇంత అద్భుతంగా పర్ఫామెన్స్ చేస్తుంటే థాంక్యూ తప్ప ఇంకేమీ చెప్పలేకపోతున్నాను.. బడ్జెట్ విషయంలో అన్నిట్లోనూ మాకు ఎప్పుడూ అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కు థాంక్స్. ముత్తంశెట్టి మీడియాకు కూడా నేను తిరిగి ప్రేమ చూపించే టైం వచ్చింది. సినిమాలో నాతో పాటు నటించిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. మీరు అంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టే నా పర్ఫామెన్స్ బాగుంది. సినిమా ఇంత పెద్ద విజయం అందించినందుకు మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అంటూ అభిమానులనుద్దేశించి మాట్లాడారు.

Also Read : తిరుప‌తిలో.. ‘పుష్ప’ మాసీవ్ సక్సెస్ పార్టీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్