Premium liquor available: ఏపీ ప్రభుత్వం మద్యం వినియోగదారులకు ఊరట ఇచ్చే విషయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటినుంచి మద్యం ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే మద్యంపై పన్ను రేట్ల సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి మద్యం ప్రియులు ఇష్టపడే ప్రీమియం బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. దీనికోసం ఎక్సైజ్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించనున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ బ్రాండ్లు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న మద్యం అక్రమ రవాణా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ అక్రమ మద్యం పట్టుబడుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రీమియం బ్రాండ్లపై నిర్ణయం తీసుకుంది.
Also Read : నేటి నుంచే పెంచిన పెన్షన్ పంపిణీ