Saturday, July 27, 2024
Homeసినిమాసరికొత్త రికార్డు సాధించిన అజిత్ ‘వాలిమై’ ట్రైలర్

సరికొత్త రికార్డు సాధించిన అజిత్ ‘వాలిమై’ ట్రైలర్

Valimai Trailer Out: తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ ట్రైలర్ విడుదలైంది. కేవలం 12 ఘంటల్లో 15 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా అజిత్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో నిరూపించింది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ నుంచి వస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కానుంది. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే 3 నిమిషాల 5 సెకన్ల నిడివి గల ట్రైలర్ గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోయింది. తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు హిందీ హిట్ ‘పింక్’ను తమిళంలో ‘నెర్కొండ పార్వై’గా తెరకెక్కించారు. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ట్రైలర్ లో ప్రతి ఫ్రేం గ్రాండ్ గా ఆకట్టుకుంటోంది. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తున్నాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా.

‘వలిమై’ షూటింగులో కూడా అజిత్ గాయపడ్డారు. లేటెస్టుగా విడుదల అయిన ట్రైలర్ చూస్తే.. ఆయన ఎందుకు గాయపడ్డారు? యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది ఆడియ‌న్స్‌ కు ఈజీగా అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజిత్, కార్తికేయ మధ్య మైండ్ గేమ్.. పోరాటాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. హెచ్‌.వినోద్‌ దర్శకుడు. హ్యుమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు తమిళ ట్రైలర్‌ గురువారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే కోటి యాభై లక్షల వీక్షణలు దక్కించుకుందని సోనీ మ్యూజిక్‌ సంస్థ వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్