Monday, June 8, 2026
Homeసినిమాతెలుగు తెరకి మరో అందాల సుందరి!

తెలుగు తెరకి మరో అందాల సుందరి!

Nazriya Nazim – direct Telugu film: అందాన్ని నిర్వచించడం .. నిదర్శనం చూపడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అదే కుర్రాళ్ల మనసులను పొలో మంటూ కొల్లగొడుతూ ఉంటుంది. ఆయా జనరేషన్స్ లోని కథానాయికలను చూసుకుంటే భానుప్రియ కళ్లు .. సుహాసిని నవ్వు .. జెనీలియా చలాకీదనం ప్రత్యేకమైన ఆకర్షణగా కుర్రాళ్ల మనసులను దోచేశాయి. అలాంటి ఆకర్షణలన్నీ ఒకచోట పోగు చేసినట్టుగా అనిపించే కథానాయికగా ఎవరైనా ఉన్నారా అంటే, వెంటనే కళ్ల ముందు కదిలే రూపం .. నజ్రియా నజీమ్.

నజ్రియా మలయాళ ఇండస్ట్రీకి చైల్డ్ ఆరిస్ట్ గా పరిచయమై .. ఆ తరువాత కాలంలో హీరోయిన్ గా మెరిసింది. చైల్డ్ ఆర్టిస్టుగా చేసి హీరోయిన్ గా తెరపైకి వచ్చినప్పుడు శ్రీదేవి .. మీనాలను చూసి ఇక్కడి ప్రేక్షకులు ఎలా షాక్ అయ్యారో. అక్కడ కూడా నజ్రియాను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అందాల జలపాతం అంటూ అక్కడి ప్రేక్షకులు ఆమెను ముద్దుగా పిలుచుకున్నారు. ఆకాశంలో సగంలా అనిపించే ఆ కళ్లతో ఆమె చేసిన విన్యాసాలను చూస్తూ మంత్రం ముగ్ధులయ్యారు. అలాంటి నజ్రియా తమిళ ప్రేక్షకులను కూడా అదే రేంజ్ లో అలరించించింది .. ఆకట్టుకుంది.

తమిళ అనువాదం ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు తెరపై ఈ బ్యూటీని చూసిన ఇక్కడి ప్రేక్షకులకు కొంతకాలం పాటు కుదురు .. కునుకు లేకుండా పోయాయి. ఈ అమ్మాయి మన తెలుగు సినిమాలు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అలాంటివారి నిరీక్షణకు తెర దించేస్తూ .. ‘అంటే .. సుందరానికీ’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. నాని కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాతో నజ్రియా ఇక్కడి ప్రేక్షకుల ముచ్చట తీర్చనుందన్న మాట.

Also Read : హిందీలో 75 కోట్ల వసూళ్ళ దిశగా పుష్ప

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular