Bangladesh lead: న్యూజిలాండ్ – బంగ్లాదేశ్ మధ్య బే ఓవల్ మైదానంలో జరుగుతోన్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టుపై 73 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కెప్టెన్ మోనిముల్ హక్ 88; లిటన్ దాస్-86 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లకు 175 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టింది. నిన్న 70 పరుగులతో అజేయంగా నిలిచిన మహ్ముదుల్ నేడు మరో 8 పరుగులు జోడించి 78 వద్ద ఔటయ్యాడు. ముష్ఫిఖర్ రహీం కేవలం12పరుగులే చేసి బోల్ట్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
ఐదో వికెట్ కు కెప్టెన్ మోనిముల్ హక్ -లిటన్ దాస్ లు 158 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు 361 వద్ద కెప్టెన్ హక్ ఔట్ కాగా, 370 వద్ద లిటన్ దాస్ కూడా బోల్ట్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ ఆరు వికెట్లకు 401 పరుగులు చేసింది. యాసిర్ అలీ-11; మెహిదీ హాసన్-20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్, బోల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Also Read : న్యూజిలాండ్ తో టెస్ట్: బంగ్లా 175/2