Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ కు అస్సలు కలిసిరావడం లేదు. కేవలం ఒకటి రెండు పాయింట్లతో మ్యాచ్ ను కోల్పోతోంది. నేడు జరిగిన మ్యాచ్ లో కూడా పాట్నా పైరేట్స్ చేతిలో ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. మరో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది.
బెంగాల్ వారియర్స్ – జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో బెంగాల్ 31-28 తో గెలుపొందింది. జైపూర్ రైడర్ ఆటగాడు అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లు (13టచ్, 3బోనస్) సాధించినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధ భాగంలో బెంగాల్ 18-14 తో ఆధిక్యం సంపాదించింది. రెండో భాగంలో జైపూర్ కాస్త పుంజుకొని బెంగాల్ పై 14-13 తో ఒక పాయింట్ ఆధిక్యం పొందింది. ఆట ముగిసే సమయానికి మూడు పాయింట్ల తేడాతో బెంగాల్ గెలుపొందింది. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 13 (11టచ్, 1బోనస్, 1టాకిల్) పాయింట్లు సాధించాడు.
తెలుగు టైటాన్స్ – పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ 31-30 తో విజయం సాధించింది. ఆట తొలి భాగంలో పాట్నా 18-13 తో ఆధిక్యంలో ఉంది. కానీ రెండో అర్ధ భాగంలో టైటాన్ దూకుడు ప్రదర్శించి 17-13 తో లీడ్ సాధించినా లాభం లేకపోయింది. ఒక పాయింట్ తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. టైటాన్స్ రైడర్ అంకిత్ బేణివాల్ 10 (9టచ్, 1 బోనస్) పాయింట్లతో రాణించాడు. ఈ విజయంతో పాట్నా పైరేట్స్ మూడో స్థానానికి ఎగబాకింది
బెంగుళూరు 23 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా… ఢిల్లీ (21); పాట్నా పైరేట్స్ (21); యూ ముంబా(17); బెంగాల్ వారియర్స్ (16); తమిళ్ తలైవాస్ (14); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: దూసుకుపోతున్న బెంగుళూరు