Johannesburg Test: జోహెన్స్ బర్గ్ టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 229 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా రాణించి ఏడు వికెట్లు సాధించాడు. వాండరర్స్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో నిన్న మొదటిరోజు ఇండియా 202 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఒక వికెట్ నష్టానికి 35 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి రెండోరోజు ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికాలో కీగాన్ పీటర్సన్-62; బావుమా-51 పరుగులు చేశారు. కెప్టెన్ ఎల్గర్-28; వెర్రిన్నే, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ లు తలా 21 పరుగులు చేశారు. శార్దూల్ ఏడు, షమి రెండు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇండియా తుది ఇన్నింగ్స్ లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ రాహుల్ 8 పరుగులకే మార్కో జాన్సేన్ బౌలింగ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 23 పరుగులు చేసి ఒలివియర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చతేశ్వర్ పుజారా-35, అజింక్యా రేహానే-11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి ఇండియా 58 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read : ఇండియా 202 ఆలౌట్; సౌతాఫ్రికా 35/1