Sunday, March 15, 2026
Homeసినిమాసంక్రాంతి బరిలో విశాల్ ‘సామాన్యుడు

సంక్రాంతి బరిలో విశాల్ ‘సామాన్యుడు

Sankranthi -Samanyudu: సరికొత్త కథలను తెర పైకి తీసుకొస్తూ.. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటారు కోలీవుడ్ స్టార్ విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘సామాన్యుడు’ ఓ యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ తు.ప.శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా జనవరి 14న సంక్రాంతి పండుగకి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా ‘సామాన్యుడు’ మూవీ నుంచి రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తే.. ఫుల్ యాక్షన్ మూడ్ లో ‘సామాన్యుడు’ సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విశాల్ సరసన డింపుల్ హయతి నాయికగా నటించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘సామాన్యుడు’ సినిమాను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా మార్చేశాయి. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular