Saturday, November 23, 2024
HomeTrending Newsపోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సిఎంఓ అధికారి

పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సిఎంఓ అధికారి

Review on Polavaram: పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ తో కలిసి  క్షేత్రస్థాయిలో పనుల తీరును పర్యవేక్షించారు. ముందుగా స్పిల్ వే, గేట్ల పనితీరును, ఎగువ కాఫర్ డ్యామ్,  ఫిష్ లాడర్ , దిగువ కాఫర్ డ్యామ్ పనులను పరిశీలించారు. గతంలో గోదావరి కి వరద జలాలు స్పిల్వే ద్వారా విడుదల చేసిన  నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు, గేట్ల పనితీరు తదితర అంశాలపై అధికారులు వివరించారు.  పెండింగులో ఉన్న డిజైన్ల అంశాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రాజెక్టు  ప్రాంతానికి చేరుకుని అక్కడి నుండి స్పిల్వే పనులను పరిశీలించి, కాపర్ డ్యామ్ వద్ద జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోలవరం నిర్వాసితుల గ్రామాలకు చెందిన 19 గ్రామ ప్రజల  సమస్యలు పరిష్కరించాలని వారి ప్రతినిధులు ప్రవీణ్ ప్రకాష్ వారికి వినతి పత్రం అందజేశారు.

పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలు పోలవరం ప్రాజెక్ట్ సీఈ  బి.సుధాకర్ బాబు, ఎస్ ఈ  నరసింహ మూర్తి  లు ముఖ్య కార్యదర్శి కి, జిల్లా కలెక్టర్ కి వివరించారు.  ఆర్డీవో వై. ప్రసన్న లక్ష్మి, డిఎస్పీ కె.లతాకుమారి, ఈఈలు,డీఈఈలు పి. సుధకర్ రావు, మల్లిఖార్జున రావు, ఆదిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్