Friday, June 12, 2026
Homeసినిమా ట్రెండింగ్ లో నెంబర్ 1 ‘బింబిసార’

 ట్రెండింగ్ లో నెంబర్ 1 ‘బింబిసార’

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం బింబిసార. ఈ చిత్రానికి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్ డ్రామాగా రూపొందే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్‌ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బింబిసార మూవీ పోస్టర్ అండ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ టైటిల్ అండ్ వీడియోకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఈ వీడియో యూట్యూబ్ లో 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుంది. అంతే కాకుండా.. ఇది  ట్రెండింగ్ లో నెంబర్ 1లో నిలవడం విశేషం.

సరైన సక్సెస్స్ కోసం చూస్తున్న కళ్యాణ్‌ రామ్ ఈసారి ఓ విభిన్న కథా చిత్రాన్ని ఎంచుకున్నారు. తెలుగులో అతి తక్కువ సార్లు టచ్ చేసిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కి హిస్టారికల్ షేడ్స్ ను మిక్స్ చేసి తీస్తున్న సినిమా ఇది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ నటిస్తున్నారు. మూవీ టైటిల్, కళ్యాణ్ రామ్ గెటప్స్ చూస్తుంటే.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడం ఖాయమనిపిస్తోంది.  మరి కళ్యాణ్‌ రామ్ కి ఆశించిన విజయాన్ని బింబిసార అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular