0.1 C
New York
Thursday, December 7, 2023

Buy now

HomeTrending Newsబాబూ నిన్ను నమ్మం : సునీల్ దేవధర్

బాబూ నిన్ను నమ్మం : సునీల్ దేవధర్

ఎన్టీఆర్ కు ఏ విధంగా వెన్నుపోటు పోడిచారో ప్రధాని నరేంద్ర మోడికి సైతం అదే విధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. బిజెపిని దూరం చేసుకున్న విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందని, అంచనాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు.

బిజేపితో సహా విపక్షాలతో కలిసి వైఎస్సార్ ప్రభుత్వంపై పోరాడతామంటూ చంద్రబాబు నిన్న మహానాడులో చేసిన వ్యాఖ్యలపై సునీల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికే అయన ఈ ఎత్తుగడలు వేస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేదన్నారు.

2024లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడిపోతున్న విషయం మహానాడు ద్వారా వెల్లడైందని, కానీ తాము మాత్రం చంద్రబాబుతో మళ్ళీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ నాయకత్వంలోని బీజేపీ, జనసేన పార్టీలు జగన్, చంద్రబాబుల అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

.

RELATED ARTICLES

Most Popular

న్యూస్