తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,153 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే పెద్ద సంఖ్యలో కేసులు రావటం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. సంక్రాంతి పండుగకు జంటనగరాల నుంచి స్వస్తలాలకు వెళ్ళే వారితోమళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశం ఉంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,045కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 417 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి.