Thursday, June 11, 2026
Homeసినిమాసితార బ్యాన‌ర్ లో వైష్ణ‌వ్ తేజ్

సితార బ్యాన‌ర్ లో వైష్ణ‌వ్ తేజ్

Sitara: Vaishnav Tej: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమాతోనే సంచ‌ల‌నం సృష్టించాడు. చిన్న సినిమాగా రూపొందిన ఉప్పెన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ఆత‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్ క్రిష్ డైరెక్ష‌న్ లో ‘కొండ‌పొలం’ చేశారు. ఇది క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్స‌స్ కాక‌పోయినా.. న‌టుడుగా వైష్ణ‌వ్ తేజ్ కి మంచి పేరు తీసుకువ‌చ్చింది.

ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ తేజ్.. గిరీషయ్య దర్శకత్వంలో తన మూడవ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే.. ఈరోజు (జనవరి 13) వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.   మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ‌చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular