పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిరోజు ఉభయసభల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల తొలి అర్ధభాగం ఫిబ్రవరి 11న ముగియనుంది. నెల రోజుల విరామం తర్వాత మార్చి 14న తిరిగి ప్రారంభమై.. ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి.